తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన తోటకూర మారమ్మ.. ప్రస్తుతం రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి పదవి ఉన్నా ఆమెకు నిలువ నీడ లేదు. ఉప్పాడలోని తనకున్న ఒకే ఒక ఇల్లు.. నివర్ తుపాను కారణంగా కోతకు గురై సముద్రగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉండాలో కూడా తెలియని దుస్థితి. కూలిపోయిన ఇంట్లో సామగ్రిని తీసుకొని పక్కింట్లో ఆశ్రయం పొందుతోంది.
ఇల్లు సముద్రంలో కలిసి.. వారం రోజులు అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని మారమ్మ వాపోతోంది. ఎంతమంది నాయకులు ఉన్నా.. తనను ఎవరూ పరామర్శించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజకీయంగా పదవులు చేపట్టినా ఒక్క రూపాయి సంపాదించుకోలేదని.. ఎంతోమంది తమ పార్టీలోకి రావాలని అనేక విధాలుగా ఆశ చూపి పిలిచినా జగన్నే తన కుమారుడిగా భావిస్తూ... వైకాపాలోనే కొనసాగుతున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం బస్ షెల్టర్లలో తలదాచుకుంటున్నట్టు చెప్పి.. కన్నీటి పర్యంతమైంది. ముఖ్యమంత్రి జగన్ తనను ఆదుకోవాలని కోరుతోంది.
ఇదీ చదవండి: