అమలాపురంలోని జానకి పేటలో ఐదు పోర్షన్లుతో ఉన్న తాటాకు ఇల్లు దగ్ధమైంది. దీంతో ఎనిమిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎనిమిది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బాధిత కుటుంబాలను పరామర్శించి వ్యక్తిగత ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించారు.
ఇదీ చదవండీ... సర్పంచ్ ఎన్నికల బరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్