తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అప్పుల బాధ తాళలేక తండ్రి కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆదిలక్ష్మి నగర్లో నివాసముంటున్న కర్రి ఆంజనేయ రెడ్డి (55), అతని కుమారుడు మోహన్ లక్ష్మణ్ రెడ్డి.. స్థానిక గౌతమి గోదావరి వంతెన మీద ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతం వద్ద ఆంజనేయ రెడ్డి మృతి చెందగా.... కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: