రోడ్డు ప్రమాదంలో తండ్రి,కుమార్తె మృతి - కాకినాడలో రోడ్డు ప్రమాదం వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడలోని రమణయ్యపేట ఏపీఎస్పీ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. వీరిద్దరు పాయకరావుపేటలోని స్వచ్ఛవరం గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాల వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.