ఖరీఫ్ సీజన్లో విత్తనాలు అందించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండల రైతులు స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పంచాయతీలో సుమారు వందమందికి పైగా 90 శాతం రాయితీపై విత్తనాలు పొందేందుకు ఒక్కొక్కరు వంద రూపాయలు చొప్పున వాలంటీర్లకు ఇచ్చామని, కానీ విత్తనాలు అందుబాటులో లేవని వస్తే ఇస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నారుమడులకు అంతా సిద్ధం చేసుకునే సరికి విత్తనాలు లేవంటూ అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రంపచోడవరం పంచాయతీలో చెరువు పాలెంలో 34 మంది రైతులు ఒక్కొక్కరు వంద రూపాయలు చెల్లించాలన్నారని తెలిపారు. పందిరిమామిడి గ్రామంలో రైతులు విత్తనాల కోసం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా విత్తనాలు లేవని గ్రామ వాలంటీర్లు తిరస్కరించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఇన్ఛార్జీ పీవో, సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యకు వినతి పత్రాన్ని అందించారు.
ఇది చదవండి గవర్నర్తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ!