తమ పంట పొలాలకు వెళ్లే దారిని అక్రమించారని ఆరోపిస్తూ, తూర్పుగోదావరి జిల్లా గోకివాడలో రైతులు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. సుమారు 100ఎకరాల పొలాలకు వెళ్లే, పుంతరోడ్డును ఆ ఊరికే చెందిన రేవాడ వసంతరావు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని రైతులు ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన రైతులను వసంతరావు బెదిరిస్తున్నాడని చెప్పారు. సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తమకు చివరి ప్రయత్నంగా చావే శరణ్యమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి :