ETV Bharat / state

ఆ పిచ్చుకలు, చిలకలే ఆయన నేస్తాలు..

ఉదయం, సాయంత్రం తన ఇంటి ప్రహరీ పొడవునా.. ధాన్యం రాశులు వేస్తుంటాడు ఆయన. ఐదేళ్లుగా ఇదే డ్యూటీ ఆయనకు. ఎందుకంటే.. ఆయన నేస్తాలు ఆకలి తీర్చుకునేందుకు నేరుగా అక్కడకే వస్తుంటాయి కాబట్టి.! అవునండీ.. కావాలంటే ఆయన నేస్తాలు ధాన్యాన్ని ఎలా తింటారో చూడాలనుకుంటున్నారా..? అయితే కాకినాడకు దగ్గరలో ఉన్న రేపూరుకు వెళ్లాల్సిందే.

author img

By

Published : May 2, 2021, 9:04 AM IST

old man feed birds
ఐదేళ్లుగా పక్షులకు ఆహారం అందిస్తున్న సుందరరావు

ఐదేళ్లుగా పక్షుల కోసం ధాన్యాన్ని.. ఉదయం, సాయంత్రం గోడ మీద వేయటం ఆ రైతుకి పరిపాటిగా మారింది. మెుదట రెండు మూడు పిచుకులతో మెుదలైన ప్రయాణం.. ఇప్పుడు రామచిలుకలు, ఉడుతల వరకు వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం రేపూరుకు చెందిన సుందరరావుకు పక్షుల కిలకిలారావాలు అంటే ఎంతో ఇష్టం. ఆ మక్కువతోనే పక్షలు ఆకలి తీర్చేందుకు.. ఇళ్లనే వేదికగా చేసుకొని ఐదేళ్లుగా నిరంతరాయంగా వాటికి ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. తన ఇంటి ప్రహరీపై ధాన్యం గింజలను వేయగానే.. రామచిలుకలు, పిచ్చుకలు, ఉడుతలు వాలి పోతాయి. పక్షుల మేత కోసం తన పొలంలో పండిన ధాన్యాన్ని వినియోగిస్తున్నట్లు సుందరరావు తెలిపారు.

ఇదీ చదవండి: చిత్రం భలారే విచిత్రం: కోతి పిల్లతో కొండముచ్చు స్నేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.