ఆ పసి మనసులకు తమ అమ్మానాన్నల మధ్య ఏం జరుగిందో తెలియది. ప్రతి రోజులానే తండ్రి పిలవగానే వచ్చి బండెక్కారు. ఎక్కడి వెళ్తున్నాం నాన్నా అని కూడా అడగలేదు. తండ్రితోపాటు వారధిపైకి చేరుకొన్నారు. నాన్న మనసులో రాసుకున్న మరణ శాసనాన్ని తెలియని చిన్నారులు.. నాన్నకు చెరో పక్క నిలబడి నదీ ప్రవాహాన్ని చూస్తూ సంతోషించే క్షణాలే వారి జీవితానికి చివరి క్షణాలని గ్రహించలేక పోయారు. తండ్రి దూకమనగానే నదీలోకి దూకడమే ఆ చిన్నారులకు తెలిసింది.
ఇద్దరు పిల్లలతో కలిసి యానాం సమీపంలోని గౌతమి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ముమ్మిడి శ్రీనివాస్ మృతదేహం ఈ రోజు తెల్లవారుజామున యానాంకు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లంక వద్ద మత్స్యకారులు గుర్తించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు కవలలైన పాప హర్షిని, బాబు హర్షల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈరోజు మూడు మృతదేహాలకు ప్రభుత్వ ఆసుపత్రి లో శవ పరీక్ష నిర్వహించి అనంతరం బంధువులకు అందజేయనున్నారు.
ఇదీ చదవండి: జులైలో భారం కానున్న సాధారణ రేషన్...ధరలు పెంపు