ETV Bharat / state

తూర్పు తీరంలో తుఫాన్.. ఫ్యాన్ గాలికి తెదేపా కకావికలం

రాష్ట్రంలోనే... అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా తూర్పూగోదావరి. 19 అసెంబ్లీ స్థానాలు.. 3 పార్లమెంటు నియోజకవర్గాలతో అత్యధిక స్థానాలు ఇక్కడున్నాయి. మెుత్తం 19 శాసన సభ నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. మాడుకు మాడు పార్లమెంట్ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకొని క్లీన్​స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నాలుగు శాసన సభ స్థానాలతో సరిపెట్టుకోగా... జనసేన ఇక్కడే ఖాతా తెరిచింది.

తూర్పులో వీచిన 'ఫ్యాన్' గాలి
author img

By

Published : May 24, 2019, 4:05 AM IST

2014 ఎన్నికల్లో 12 చోట్ల తెదేపా విజయకేతనం ఎగరవేసింది. వైఎస్సార్సీపీ 5 చోట్ల మాత్రమే విజయం సాధించింది. కానీ ఈసారి వైకాపా పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ..14 చోట్ల విజయం సాధించింది.

తెదేపాకు ఆ నాలుగు...
జిల్లాలో ఆసక్తి రేపిన నియోజకవర్గం పెద్దాపురం. ఇక్కడ నుంచి తెదేపా తరపున ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప బరిలో నిలిచారు. వైకాపా తరఫున మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి పోటీలో ఉన్నారు. ఇరువురూ.. తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా చివరకు చిన రాజప్పనే విజయం వరించింది. మండపేటలో తెదేపా తరఫున వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్​పై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. రాజమండ్రి సిటీ నుంచి తెదేపా తరపున ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు.తెదేపా సీనియర్ నేత ఎర్రనాయుడు కుమార్తె అయిన భవానీ తన సమీప వైకాపా ప్రత్యర్థి రౌతు సూర్యప్రకాశ్ రావుపై విజయం సాధించారు. అత్యంత ఆసక్తిగా మారిన మరో నియోజకవర్గం రాజమహేంద్రవరం గ్రామీణం. ఇక్కడ నుంచి తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బరిలో నిలవగా... వైకాపా తరఫున ఆకుల వీర్రాజు బరిలో నిలిచారు. ఫలితాలలో ఉత్కంఠ రేపిన ఈ నియోజకవర్గంలో వీర్రాజుపై బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.

పద్నాలుగుతో వైకాపా ప్రభంజనం
ఎస్టీ రిజర్వ్​డ్ నియోజకవర్గమైన రంపచోడవరంలో వైకాపా అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి తెదేపా అభ్యర్థి వంతల రాజేశ్వరిపై విజయం సాధించారు. ఇక్కడి నుంచి జనసేన మద్దతుతో బరిలో నిలిచిన సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఓటమిపాలయ్యారు. జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన తునిలో వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయకేతనం ఎగరవేశారు. తెదేపా నుంచి బరిలోకి దిగిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుపై ఆయన విజయం సాధించారు. కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంత లక్ష్మిలు ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైకాపా అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. నగరం నుంచి ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి విజయం సాధించగా...రూరల్ నుంచి కురసాల కన్నబాబు గెలిచారు. ముమ్ముడివరం నియోజకవర్గంలో తెదేపా, వైకాపాతోపాటు జనసేన గట్టి పోటీనివ్వగా చివరకు వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీశ్​ను విజయం వరిచింది. తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్సీకి కేటాయించిన గన్నవరం, అమలాపురం నియోజకవర్గంలో వైకాపా పాగా వేసింది. తెదేపా అభ్యర్థులు నేలపూడి స్టాలిన్ బాబు, అయితాబత్తుల ఆనందరావులపై వైకాపా అభ్యర్థులు కొండేటి చిట్టిబాబు, పి.విశ్వరూప్​లు జయకేతనం ఎగరవేశారు.

సామాజిక వర్గాలే ప్రధానాంశంగా రామచంద్రపురం నియోజకవర్గంలో తెదేపా సీనియర్ నేత తోట త్రిమూర్తులు, వైకాపా తరఫున జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చెల్లిబోయిన వేణుగోపాల్ పోటీ చేయగా... విజయం వేణుగోపాల్​ని వరించింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వరుపుల జోగిరాజుపై వైకాపా అభ్యర్థి పూర్ణచంద్ర ప్రసాద్ విజయం సాధించారు. కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావుపై అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి జయకేతనం ఎగరవేశారు. పిఠాపురంలో తెదేపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ ఓటిమ చవిచూశారు. వైకాపా తరఫున పోటీ చేసిన పెండెం దొరబాబు విజయం సాధించారు. జగ్గంపేట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు విజయదుందుభి మోగించారు. రాజానగరం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన యువనేత జక్కంపూడి రాజా తెదేపా నుంచి పోటీ చేసిన పెందుర్తి వెంకటేశ్​పై విజయం సాధించారు. అనపర్తిలో తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిపై వైకాపా అభ్యర్థి సత్యనారాయణరెడ్డి జయకేతనం ఎగరవేశారు.

బోణి కొట్టిన జనసేన
రాష్ట్రవ్యాప్తంగా జనసేన కూటమి పరాజయం పాలైనా... రాజోలులో మాత్రం విజయం సాధించింది. రెండు చోట్ల పోటీ చేసిన జనసేనాని ఓటమి చవిచూడగా రాజోలులో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు, వైకాపా అభ్యర్థి బొంతు రాజేశ్వరరావులు గట్టి పోటీనిచ్చినా... చివరకు విజయం మాత్రం రాపాకనే వరించింది.

పార్లమెంటు స్థానాల్లో పాగా వేసిన వైసీపీ
మాడు పార్లమెంటు స్థానాల్లోనూ వైకాపా విజయ ఢంకా మోగించింది. రాజమహేంద్రవరంలో తెదేపా సిట్టింగ్ ఎంపీ మాగంటి రూపపై వైకాపా అభ్యర్థి మార్గాని భరత్ విజయం సాధించారు. అమలాపురంలో తెదేపా తరఫున పోటీ చేసిన హరీష్ మాథుర్​పై వైకాపా అభ్యర్థి చింతా అనురాధ విజయ దుందుభి మోగించారు. కాకినాడ నుంచి వైకాపా తరఫున మాజీ ఎంపీ వంగా గీత, తెదేపా నుంచి చలమలశెట్టి సునీల్ పోటీలో నిలవగా...వంగా గీత విజయం సాధించారు.

ఇదీ చదవండి: జిల్లాల వారీగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థులు

Intro:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_46_23_undi_TDP_mla_Win_g6
మొబైల్ 9849859923
యాంకర్ :పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా మంతెన రామరాజు విజయం సాధించారు .మొత్తం ఒక లక్షా 86 వేల 77 ఓట్లు పోలుకాగా తెదేపా అభ్యర్థి మంతెన రామరాజు 82,730 ఓట్లను సాధించగా తన సమీప ప్రత్యర్థి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహ రాజు 71 781 ఓట్లను సాధించారు .దీంతో 10,949ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు విజయం సాధించారు . ఉండీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మరోమారు కంచుకోటగా ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి. ఈ సందర్భంగామంతెన రామరాజు మాట్లాడుతూ రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తాను అన్నారు
బైట్ :మంతెన రామరాజు ,ఉండి నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి

Body:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_46_23_undi_TDP_mla_Win_g6
మొబైల్ 9849859923

Conclusion:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_46_23_undi_TDP_mla_Win_g6
మొబైల్ 9849859923

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.