ETV Bharat / state

"ఎందుకింత ఆలస్యం?" - జగన్‌ అక్రమాస్తుల కేసుపై ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం - SC ON JAGAN ILLEGAL ASSETS CASE

జగన్‌ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశం

SC on Jagan Illegal Assets Case
SC on Jagan Illegal Assets Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 1:15 PM IST

SC on Jagan Illegal Assets Case : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని, కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్‌ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్‌ అప్లికేషన్ల వివరాలందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసుల వివరాలను విడివిడిగా చార్ట్‌ రూపంలో అందించాలని పేర్కొంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు ట్రయల్‌ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రయల్‌ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతుందని ధర్మాసం ప్రశ్నించింది.

ఈ క్రమంలో డిశ్చార్జ్‌, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాల వల్లే ఆలస్యమని న్యాయస్థానానికి వివరించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్‌ కోర్టు, పెండింగ్‌ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు- డిశ్చార్జి పిటిషన్లపై విచారణకు సిద్దమవుతున్న సీబీఐ కోర్టు - YS Jagan Illegal Assets Case

జగన్‌ అక్రమాస్తుల కేసు - సుప్రీంకోర్టులో కీలక పరిణామం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.