అమలాపురం రూరల్ మండలం సమనస ఎస్బీఐ బ్రాంచ్లో నగదు అధికారిగా పని చేస్తున్న బులుసు వీర వెంకట సత్య సుబ్రహ్మణ్య శర్మను... పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ షేక్ మాసూం భాషా వెల్లడించారు. 2019 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జూలై 24 మధ్య కాలంలో బ్యాంకులో నకిలీ బంగారు రుణాల పేరిట రూ. కోటి నగదును మాయం చేశాడు.
ఈ విషయంపై... సెప్టెంబర్ 29న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలె బ్యాంకులో జరిగిన ఇంటర్నెల్ ఆడిట్లో నకిలీ బంగారు రుణాల వ్యవహారం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి :