కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వచ్చే నెల ఆరో తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారులు ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. గతంలో యానాంలో 30 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన కరోనా నిబంధనలకు అనుగుణంగా వీటి సంఖ్య 60కి పెంచారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 500 నుంచి 600 ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అదనంగా ముప్పై ఈవీఎంలు ఉపయోగించనున్నారు.
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రాజశేఖర్, రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ పర్యవేక్షణలో బ్యాలెట్ పేపర్ పెట్టి.. కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాడ్లకు అనుసంధానించి ఓట్లు వేసి పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి అవుతుందని అమన్ శర్మ తెలిపారు. సక్రమంగా ఉన్న ఓటింగ్ మిషన్లకు సీలు వేసి.. ఎన్నికల రోజున ఉపయోగిస్తారని చెప్పారు. అప్పటివరకు వాటిని స్ట్రాంగ్ రూమ్స్‌లో పెట్టి సీసీ కెమెరా, అదనపు పోలీసు బలగాలతో భద్రత కల్పిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి: యనమల రామకృష్ణుడు