ETV Bharat / state

'కేంద్రానికి చంద్రబాబు లేఖ రాస్తే తప్పేంటి?' - mp gvl narasimha rao news

చంద్రబాబు లేఖ రాసినా... ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర జోక్యం చేసుకోదంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించిన ప్రతిసారి జీవీఎల్ స్పందించడమేంటని అసహనం వ్యక్తం చేశారు.

gollapalli surya rao
gollapalli surya rao
author img

By

Published : Aug 20, 2020, 4:25 PM IST

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎవరికైనా వినతిపత్రం ఇవ్వడం సాధారణమని చెప్పారు.

వైకాపా ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించిన ప్రతిసారీ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించడమేంటి? రాష్ట్రంలో అనేకమంది భాజపా నాయకులు ఉండగా... ఎక్కడో ఉత్తరప్రదేశ్​కు చెందిన జీవీఎల్ చంద్రబాబు వ్యాఖ్యలపై ఎందుకు స్పందిస్తున్నారు. జీవీఎల్ గ్రామ స్థాయి నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి అయితే ప్రజా సమస్యలపై అవగాహన ఉండేది.

- గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి

--

ఇదీ చదవండి:

ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.