ETV Bharat / state

నదుల్లో కలిసే కలుషిత నీరు శుద్ధిచేసేందుకు ప్లాంటు ఏర్పాటు - Government of Andhra Pradesh latest news

నదుల్లో కలిసే కలుషిత నీరు శుద్ధిచేసేందుకు ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాంటు నోడల్ అధికారిగా పురపాలకశాఖ కార్యదర్శిని నియమించారు. 5 నదుల్లో కలుషిత నీరు చేరుతుందని గతంలో కేంద్ర సీపీసీబీ పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Establishment of a plant to treat polluted water that meets rivers
నదుల్లో కలిసే కలుషిత నీరు శుద్ధిచేసేందుకు ప్లాంటు ఏర్పాటు
author img

By

Published : Aug 5, 2020, 3:44 PM IST

రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్న కలుషిత నీటి శుద్ధి కోసం వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్​లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుకు నోడల్ అధికారిగా పురపాలక శాఖ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమహేంద్రవరం, విజయవాడ, తాడేపల్లి, శ్రీకాకుళం, నంద్యాలలోని ఐదు నదులలో కలుషిత నీరు చేరుతుందని గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 100 శాతం కలుషిత నీటిని శుద్ధి చేసే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చదవండీ... ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.