ETV Bharat / state

ఎన్నికల ఏజెంట్‌ ఆత్మహత్య... వైకాపా నాయకులు బెదిరించారంటూ లేఖ

ఈ నెల 21న జరిగిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం నడిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎన్నికల ఏజెంట్‌ ఆత్మహత్య... వైకాపా నాయకులు బెదిరించారంటూ లేఖ
ఎన్నికల ఏజెంట్‌ ఆత్మహత్య... వైకాపా నాయకులు బెదిరించారంటూ లేఖ
author img

By

Published : Feb 25, 2021, 5:34 AM IST

నడిపూడి గ్రామంలోని మెట్ల రాంజీ కాలనీకి చెందిన యాళ్ల రవిశంకర్‌ (27) మంగళవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. రవిశంకర్‌ రాసిన లేఖ బుధవారం ఉదయం తల్లిదండ్రులకు దొరికింది. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులు 25 ఓట్లు రిగ్గింగ్‌ చేశారని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. రిగ్గింగ్‌ జరిగిన విషయం పోలింగ్‌ ప్రక్రియను చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్లకు తెలుసని వివరించారు. దీనిపై స్థానిక పోలీసులతో పాటు ఎన్నికల సంఘానికి టోల్‌ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేసినట్లు రవిశంకర్‌ తల్లిదండ్రులు శ్రీదేవి, సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి సబ్‌కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌కు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: సీడ్​యాక్సెస్​ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.