ఈ చిత్రంలో కనిపిస్తున్నవి పాములు అనుకుంటే పొరపాటే..అవి చేపలే. తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో ఓ మత్స్యకారుడికి ఈ చేపలు లభ్యమయ్యాయి. స్థానికంగా వీటిని తెల్ల, నల్ల పాములు అని పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం ఈల్ చేపలు.
వీటి శరీరంలో ఉండే తెల్లటి బుడగకు చాలా డిమాండ్ ఉంది. ఈ తెల్ల బుడగను ఔషదాలు తయారీలో వాడతారు. పదేళ్ల క్రితం ఈ జాతికి చెందిన చేపలు ఎక్కువగా దొరికేవి. ఇప్పుడు చాలా అరుదుగా వస్తుంటాయని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలను చూడటానికి సందర్శకులు పోటీపడ్డారు.
ఇదీ చదవండి: