తూర్పుగోదావరి రామచంద్రాపురంలో దొంగతనం జరిగింది. 40తులాల బంగారం, 2కేజీల వెండితో పాటు 20 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
జూన్ 29న హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో అల్లూరు శ్రీనివాస రావు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వెళ్లాడు. తిరిగి గురువారం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తీసిఉన్నాయి. అనుమానమొచ్చి లోపలికి వెళ్లి చూడగా బంగారం, వెండి కనిపించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. వాటి విలువ రూ.25 లక్షలకు పైనే ఉంటుదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: East godavari: అసభ్య చిత్రాలు తీయించి బ్లాక్‌మెయిల్