జిల్లాలో 19 శాసనసభ, 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. శాసనసభకు 223 మంది, లోక్ సభకు 36 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధిక సీట్లు, ఓట్లు ఉన్న కారణంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
* జిల్లాలో 42 లక్షల 4 వేల 436 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20 లక్షల 80 వేల 751, మహిళా ఓటర్లు 21 లక్షల 23వేల 332 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 353 మంది ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా 2 లక్షల 60 వేల 323 మంది, రాజోలులో అత్యల్పంగా లక్షా 86 వేల 819 మంది ఓటర్లు ఉన్నారు.
* జిల్లాలో 4,581 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1437 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. నిర్వహణకు పోలింగ్ అధికారులు 5 వేల 39 మంది, సహాయ అధికారులు 5 వేల 39 మంది.. ఓఏవోలు, ఇతర సిబ్బంది 20 వేల 156 మంది వరకూ విధుల్లో భాగం కానున్నారు. సూక్ష్మ పరిశీలకులుగా 1580 మందిని నియమించారు. సంచార తనిఖీ బృందాలు, నియమావళి పర్యవేక్షణ బృందాలను నియమించారు.
* 15 కంపెనీల పారామిలటరీ బలగాలు, మూడు వేలకుపైగా జిల్లా పోలీసులు, ఏపీఎస్పీ బలగాలు, ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయి.
ఇవీ చూడండి