ETV Bharat / state

జరిమానా తగ్గించేందుకు రూ.25 లక్షలు లంచం - సీబీఐకి పట్టుబడ్డ వాల్తేరు డీఆర్ఎం - WALTAIR DRM BRIBE

సోదాల్లో రూ.87.6 లక్షలు, రూ.72 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం - నేరపూరిత కుట్ర, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ కేసు

Visakhapatnam Waltair DRM Taking Bribe of Rs 25 Lakhs
Visakhapatnam Waltair DRM Taking Bribe of Rs 25 Lakhs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 12:30 PM IST

Visakhapatnam Waltair DRM Taking Bribe of Rs 25 Lakhs : విశాఖపట్నం వాల్తేరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ (DRM) సౌరభ్‌ప్రసాద్‌ రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు లంచం ఇచ్చిన ముంబయికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి, పుణెకు చెందిన మరో ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో డీఆర్‌ఎం వద్ద రూ.87.6 లక్షల డబ్బుతో పాటు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్‌ తాళాలు, బ్యాంకు ఖాతాలను అధికారులు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలోని డీఆర్‌ఎం బంగ్లాతో పాటు మరికొన్ని చోట్ల చేసిన సోదాల్లో వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఎంతో పాటు ప్రైవేటు సంస్థల ప్రతినిధులపై నేరపూరిత కుట్ర, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు సీబీఐ తెలిపింది.

'నా భార్య రోజూ లక్షల్లో లంచం డబ్బు తెస్తుంది - మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే'

రూ.25 లక్షల డిమాండ్ : వాల్తేరు డివిజన్‌లో ఓ గుత్తేదారు సంస్థకు తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఆ పనులు చేయడంలో జాప్యం కావడంతో కంపెనీకి రైల్వే భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా లేకుండా తప్పించేందుకే డీఆర్‌ఎం లంచం డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబయి, పుణెకు చెందిన రెండు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఆయనను కలవగా జరిమానా తగ్గించాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు.

అయితే అదే ప్రైవేటు సంస్థకు రూ.3.17 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.25 లక్షల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత పెండింగ్‌ బిల్లుల చెల్లింపులతో పాటు, జరిమానా తగ్గించేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న డీఆర్‌ఎంకు రూ.25 లక్షలు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్నట్టు సీబీఐ ప్రకటించింది.

'ఎన్నికల్లో పోటీ చేసుకోండి - డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు' - Flexi against Bribe in Elections

ఈ పోలీసులేంటీ ఇలా అయిపోయారు బ్రో! ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - AP Police Corruptions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.