ETV Bharat / state

'బయోమెట్రిక్ తో మా ప్రాణాల మీదకు తేకండి' - latest news of east godavari dst ration

ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల ద్వారా మూడో విడతగా ఇవ్వనున్న సరుకుల పంపిణికి బయోమెట్రిక్ అమలు చేయాలనే నిర్ణయంపై.. వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది తమ ప్రాణాల మీదకు తెచ్చేలా ఉందని  తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

east godavari dst ration delears met mro officer about  ration goods
బయోమెట్రిక్ తో మా ప్రాణాల మీదకు తేవొద్దంటున్న రేషన్ డీలర్లు
author img

By

Published : Apr 28, 2020, 8:16 PM IST

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సరకుల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం తగదని తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండో విడతగా ఇచ్చిన ఉచిత వస్తువుల పంపిణీని.. బయోమెట్రిక్ విధానం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన కూపన్లతో ఇచ్చిన కారణంగా.. ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.

మళ్లీ ఈ-పాస్ తో బయోమెట్రిక్ అమలు చేస్తే కరోనా వైరస్ సోకే అవకాశముందని డీలర్లు వాపోతున్నారు. ఇది తమ ప్రాణాల మీదకు తెచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలం డీలర్ల సంఘం అసోసియేషన్ చైర్మన్ సూరపురెడ్డి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో డీలర్లు స్థానిక మండల తహసిల్దార్ జవ్వాది వెంకటేశ్వరికి తమ సమస్యను వివరించారు.

ఇదీ చూడండి:

అతి జాగ్రత్త.. ప్రాణం మీదకు తెస్తోందిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.