తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు 10 గంటల వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు మీద తిరుగుతున్న వారిపై కొత్తపేట పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొత్తపేట ఎస్ఐ రమేష్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మండలంలోని ప్రాంతాల్లో ఎటువంటి పని లేకుండా అనవసరంగా తిరుగుతున్న సుమారు 15 మందిని నిలుపుదల చేసి వారి ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని బస్సు ఎక్కించి కొత్తపేటకు క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చూడండి వలసయేతర కూలీల ఆదాయంపైనా లాక్డౌన్ ప్రభావం