తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక రేవును ఆర్డీవో భవాని శంకర్ సందర్శించారు. కోనసీమలో ఉప్పలగుప్తం మండలం మినహా మిగిలిన 15 మండలాలు గోదావరి వరద తాకిడికి గురవుతాయని ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా లంక గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు మర పడవల్లో భౌతికదూరం పాటించి ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు రేవులో మర పడవలను గత ఏడాది కంటే ఎక్కువగా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వరదలు ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఆర్డీవో వెల్లడించారు. రేవులు దాటే సమయంలో ప్రజలు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి