ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించటంతో పాటు విద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హామీఇచ్చారు.
రంపచోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్తిగా శిధిలం అవటంతో కోటి రూపాయలతో అదనంగా భవన నిర్మాణం చేపట్టారు. భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ...ఏజెన్సీలో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోకుండా నాడు నేడు అనే కార్యక్రమంతో పాఠశాలలకు మరమ్మతులు చేయించి అదనపు తరగతి గదులను నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి