తూర్పుగోదావరి జిల్లాలో 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పారు. 297 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయని... కరోనాతో ఐదుగురు మృతిచెందారని వెల్లడించారు. కేసుల తీవ్రత పెరుగుతున్నందున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను మూడు విభాగాలుగా విడదీసి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సాధారణ స్థితిలో ఉన్న వారిని హోం ఐసోలేషన్, కొవిడ్ లక్షణాలుండి చిన్నచిన్న అనారోగ్య సమస్యలున్న వారిని కొవిడ్ కంట్రోల్ సెంటర్‌కు, హైరిస్క్‌లో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఇదీ చూడండి..
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు