తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలోని ఓ వ్యక్తికి కరోనా సోకడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో గురువారం రాత్రి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి అర కిలోమీటరు రెడ్‌జోన్ గా, మరో కిలోమీటరు వరకూ హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: