రాజమండ్రిలోని పొగాకు పరిశోధన స్థానాన్ని విస్తరింపజేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ వినతి పత్రం అందజేశారు. జాతీయస్థాయి గుర్తింపు పొందిన పొగాకు పరిశోధన స్థానాన్ని బహుళ పంటల పరిశోధన స్థానంగా తిర్చిదిద్దాలని కోరారు. ఈ మేరకు ఆమె దిల్లీలోని మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. పొగాకు పరిశోధనా స్థానం మెరుగైన పంటల అభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించారు. తన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ