తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, ఒమ్మంగి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పర్యటించారు. పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబుతో కలిసి ధర్మవరంలో పేదలకు పంచనున్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు.
ఒమ్మంగిలో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను పరిశీలించారు. సచివాలయం ఉద్యోగులను పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. సమస్యలు సచివాలయ స్థాయిలోనే పరిష్కారం కావాలని.. అందుకు తగ్గట్లు పనిచేయాలని చెప్పారు.
ఇవీ చదవండి.. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు