17శాతం లోపు ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విధించిన నిబంధన పట్ల తూర్పుగోదవరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ రైతుల మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధన వల్ల మిల్లర్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు17శాతం కంటే తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని కొనగోలు చేయట్లేదని వాపోయారు. దీన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
"గత 18 సంవత్సరాలుగా పచ్చి ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముతున్నాం. ఎన్నడూ ఈ సమస్య రాలేదు. మా ప్రాంతంలో నీళ్లు ఎక్కుగా ఉండడం వల్ల ధాన్యం తేమగా ఉంటుంది. ఆరబెట్టడానికి స్థలం లేదు, ఆరబెట్టే యంత్రాలు లేవు. 40 ఎకరాల్లో పంట వేశాను. అందులో 32 ఎకరాలు లీజుకు తీసుకుని పండిచాను. ఇప్పుడు తేమ ఉన్న ధాన్యం కొనవద్దంటే నేను ఏం కావాలి?"
-ఓ రైతు
ఎకరానికి 30 వెలు పై బడి పెట్టుబడి పెట్టే నష్ట పోయాం అని రైతులు ధాన్యం రహదారి పై పోసి నిరసన తెలిపారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటం తో పోలీసులు, రెవెన్యూ అధికారులు రైతుల తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు వైదొలిగారు.
ఇదీ చదవండి: ORGANIC FARMING: భూమి పుత్రుడు.. అనితర ‘సేద్యుడు’!