కరోనా వైరస్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశుని ఆలయంలో శనివారం ప్రదక్షిణలు, దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఏడు శనివారాల నోము నోచుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం, ప్రదక్షిణలు నిలిపేస్తున్నట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
ఇదీ చూడండి: