మూడో విడత రేషన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ తప్పనిసరి చేయడాన్ని చౌక దుకాణాల రేషన్ డీలర్లు తప్పుబట్టారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్లు కోరారు. రెండు విడతల నిత్యావసర పంపిణీ గ్రామ వాలంటీర్లు, కార్యదర్శుల సమక్షంలో జరిగిందని... మూడో విడత మాత్రం బయోమెట్రిక్ తప్పనిసరం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నంద్యాలలో ఇద్దరు డీలర్లు కరోనా బారిన పడ్డారని... వేలిముద్రల ద్వారా సరుకులు పంపిణీ చేస్తే మిగతా డీలర్లకు వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. వాలంటీర్లు, ఆశా కార్యకర్తల మాదిరిగినే రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: బఫర్ జోన్ కింద 8 గ్రామాలు