లాక్డౌన్ కారణంగా బాలింతలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని పలు మండలాలకు చెందిన గర్భిణీలు, బాలింతలు వైద్యానికి.. సమీపంలోని యానాం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఉదయం తొమ్మిది గంటల తర్వాత వాహనాలను యానాంలోకి అనుమతించకపోవడం.. ప్రభుత్వం తల్లిబిడ్డ వాహనాలు రద్దు చేయటంతో.. వారంతా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వారం రోజులు కూడా నిండని బిడ్డలను ఒడిలో పెట్టుకొని.. ఆసుపత్రి బయట ఆటోల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు