ETV Bharat / state

దుబాయ్ నుంచి వచ్చి... అందర్నీ భయపెట్టి... చివరికి! - దుబాయ్ నుంచి వచ్చిన కాకినాడ వాసులు క్వారంటైన్​కు తరలింపు

దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం గృహ నిర్బంధంలో ఉండాలని పోలీసులు సూచించారు. అయినప్పటికీ వారంతా బయట తిరుగుతుండటంపై స్థానికులంతా భయపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. చివరికి.. ఆ కుటుంబాన్ని క్వారంటైన్​కు తరలించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.

dubai return persons shifted to quarantine in kakinada
దుబాయ్ నుంచి వచ్చిన వారిని క్వారంటైన్​కు తరలించిన కాకినాడ పోలీసులు
author img

By

Published : Mar 24, 2020, 11:33 AM IST

దుబాయ్ నుంచి వచ్చిన వారిని క్వారంటైన్​కు తరలించిన కాకినాడ పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ఒక అపార్టుమెంటు వాసుల్ని భయాందోళనకు గురిచేసింది. దుబాయ్ నుంచి వారు వచ్చినప్పుడు ఎయిర్​పోర్టులో చేసిన తనిఖీల్లో కరోనా వైరస్ సోకలేదని తేలింది. అయినా ఆ నలుగురు కుటుంబ సభ్యులనీ గృహనిర్బంధంలో ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా వారు బయట తిరుగుతుండటంపై స్థానికులు ఆందోళనకు గురై మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకొని ఆ నలుగుర్ని బొమ్మూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.