ఆసుపత్రి అంటే మనకేం గుర్తొస్తుంది.... ? సిరంజీలు, కత్తెరలు, సెలైన్ బాటిల్సే కదూ... కానీ చిత్రంగా తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ క్లినిక్‌లో వీటితో పాటు విఘ్నేశ్వర విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. గుడిలో ఉండాల్సిన విగ్రహాలు ఆసుపత్రిలో ఉండటమేంటని ఆలోచిస్తున్నారా... ఆ వైద్యుడు విఘ్నేశ్వర భక్తి అలాంటిది మరి. దొంతంశెట్టి వినాయకరావు అనే వైద్యుడు గణనాథునికి పరమభక్తుడు. చికిత్స చేయించుకున్న రోగులు ఆయనకు వినాయకుడంటే ఇష్టమని తెలిసి ఫీజుతో పాటు లంబోదరుని విగ్రహాలు కానుకగా ఇస్తుంటారు. ఇలా 15 ఏళ్లుగా ఆయనకు 150 విగ్రహాలు బహుమానంగా వచ్చాయి. ఇవన్నీ ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడిక్కి వచ్చేవారు వాటిని ఆసక్తిగా తిలకిస్తుంటారు. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి సేకరించిన విగ్రహాలను రోగులు ఇస్తుంటారని వినాయకరావు స్పష్టం చేశారు. వృత్తులు, నిత్య జీవితంలో చేసే పనులు తదితర ఆకృతుల్లో ఉన్న విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ గణనాధుని విగ్రహాలను అపురూపంగా చూసుకుంటూ...ప్రత్యేక పూజలు చేస్తానని చెబుతున్నారయన.
ఇదీచదవండి