పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో వివిధ సంస్థలు, దాతలు పదిహేను లక్షల రూపాయల పైగా విరాళం అందజేశాయి. విరాళాల చెక్కులను నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస నాయుడుకు ప్రతినిధులు అందజేశారు.
* పెరవలి మండలం తీపర్రుకు చెందిన కెవీవీఎస్ఎన్ అసోసియేట్స్ తరఫున కుందుల వీర వెంకట సత్యనారాయణ 6 లక్షల రూపాయలు ఇచ్చారు.
* నిడదవోలు మండలం పురుషోత్తపల్లి కి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆక్వా ఫాం తరఫున ముళ్ళపూడి శ్రీనివాస్ చౌదరి, శంకరపల్లి శ్రీ హరిలు 6 లక్షల రూపాయలు అందజేశారు.
* తీపర్రుకు చెందిన భోగవల్లి సత్యనారాయణ 2 లక్షల రూపాయలు ఇచ్చారు.
* బూరుగుపల్లి రాము లక్ష రూపాయలు ఇచ్చారు.
* సిరిపురపు వీర వెంకట సత్యనారాయణ 30 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
దాతలకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: