ఇలా చేస్తే కచ్చులూరు బోటును బయటకు తీయవచ్చు ! - గోదావరి పడవ ప్రమాదం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద మునిగిన బోటు వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ధర్నాడి సత్యం నేతత్వంలోని బృందం బోటు వెలికితీతకు ఆవిశ్రాంతంగా శ్రమిస్తోంది. యాంకర్ పట్టు సడలించడంతో నది లోపలకి వెళ్లి బోటుకు కొక్కేలు బిగించాలని ధర్మాడి సత్యం భావిస్తున్నారు. ఇదిలా ఉండగా..నదిలోపలకి వెళ్లడం సాధ్యమేనా ? బోటు బయటకు వచ్చే అవకాశాలపై భారత నౌకా దళ విశ్రాంత అధికారి, స్కూబా ఇన్స్ ట్రక్టర్ బలరామ్ నాయుడుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.