తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు అయిన రావులపాలెం మండలం గోపాలపురం వద్ద వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఉచిత భోజన సదుపాయం కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లా మీదుగా వెళ్లే వలస కార్మికుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతిరోజు భోజన సదుపాయాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇది చదవండి మరో ఘోరం: సొంతగూటికి చేరేలోగా మృత్యు ఒడికి!