కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ... ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు చూపుతున్న చొరవ అభినందనీయమని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో వాలుతిమ్మాపురంలోని పట్టాభి ఆగ్రో ఫుడ్ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో 3వేల మంది పోర్టు కార్మికులకు 10 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలు పంపిణీ చేశారు.
లాక్డౌన్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయని... కార్మికుల సహకారంతో మళ్లీ ఎగుమతులు ప్రారంభించినట్లు పట్టాభి ఆగ్రో ఫుడ్ప్రొడక్ట్స్ సభ్యులు తెలిపారు. పోర్టులో నిత్యం శ్రమిస్తున్న వివిధ వర్గాలకు తమవంతు సాయంగా నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇవీచదవండి: ఏనుగుపై ఊరేగుతూ కరోనాపై 'మోదీ' ప్రచారం