ETV Bharat / state

Verity bajji: మంగళవారంపేట ఆపిల్​ బజ్జీ.. ఇది చాలా టేస్టీ గురూ..!

సాధారణంగా పచ్చిమిర్చితోపాటు అరటి, ఆలూతో బజ్జీలు చేస్తుంటారు. కానీ జామకాయ, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్‌, స్టార్ ఫ్రూట్ తోనూ బజ్జీలు వేస్తారని మీకు తెలుసా? ఇవేకాదు ఏకంగా 25 నుంచి 30 రకాల పండ్లు, కూరగాయలతో బజ్జీలు తయారు చేస్తూ.. ఆహార ప్రియుల నోరు ఊరిస్తున్నారు.. రాజమహేంద్రవరానికి చెందిన బజ్జీ వ్యాపారి సతీశ్‌. స్థానికులతో పాటు దూరప్రాంతాల వారు.. ఆర్డర్‌పై తీసుకెళ్లడం ఈ బజ్జీల ప్రత్యేకత.

different verity bajjis found at rajamahendra varam

author img

By

Published : Nov 1, 2021, 5:31 PM IST

రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో.. 1977 నుంచి వెంకటేశ్వరరావు మిక్చర్ పాయింట్ నడుస్తోంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు సతీశ్‌ ఏదైనా వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో.. 2001 నుంచి రకరకాల బజ్జీలు తయారు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా జామ, యాపిల్, పైనాపిల్, మామిడి, ఉల్లి, తమలపాకు, వామాకు, వంకాయ, దొండకాయ, బెండకాయ, చిక్కుడు, క్యారెట్, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగు, బేబీకార్న్, టమాటా, క్యాప్సికమ్, ద్రాక్షతో బజ్జీలు వేస్తున్నారు. వీటితో పాటు జీడిపప్పు, బ్రెడ్, గులాబ్ జామ్, ఎగ్ లెస్ కేక్, పన్నీర్, ఉప్మా ఇలా 25 నుంచి 30 రకాల బజ్జీలు చేస్తారు. ఒక్కో రోజు.. కొన్ని ప్రత్యేక బజ్జీలు, సీజన్ బట్టి తయారు చేస్తారు.

మంగళవారంపేట వెరైటీ బజ్జీలు

ఎంతోకాలంగా వ్యాపారం జరుగుతుండడంతో తన కస్టమర్లతో ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి.. ఏ రోజు ఏ ఐటం వేసేది.. వారికి మెసేజ్‌ చేస్తారు. కావాల్సిన వారు ఫోన్లో ఆర్డర్‌ ఇచ్చి తీసుకెళ్తారు. రాజమహేంద్రవరం.. చుట్టుపక్కల ప్రాంతాలు, కాకినాడ, తణుకు, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వీటిని తీసుకెళ్తున్నారు. ఒక్కరోజే నిల్వ ఉండే వీటిని.. విమానంలోనూ తీసుకెళ్తారని నిర్వాహకులు చెబుతున్నారు. స్థానికంగా జరిగే శుభాకార్యాలకు ఆర్డర్లపై సప్లయ్‌ చేస్తున్నారు. బజ్జీ రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.70 వరకు అమ్ముతున్నారు. గులాబ్‌జామ్‌ బజ్జీ రూ.20, జామకాయ రూ.10, పన్నీర్‌, క్యారెట్‌, మష్రూమ్‌ రూ.15 ఇలా ధరలు ఉన్నాయి. క్వాలిటీలో రాజీపడనని..కష్టమర్లతో ఆప్యాయంగా నడుచుకోవడమే వ్యాపారం పెరగడానికి కారణమని అంటారు సతీష్‌.

'రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ, తణుకు, భీమవరం, విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా బజ్జీలను పంపిస్తాం. మా వినియోగదారులతో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఆ రోజు తయారు చేసిన ప్రత్యేక బజ్జీల వివరాలు వారికి అందిస్తాం. కావాల్సిన వారు ఫోన్లో ఆర్డర్ చేసి తీసుకెళ్తారు. బజ్జీలతో పాటు వివిధ రకాల మిక్చర్‌ కూడా తయారు చేస్తాం.'- సతీష్​

సతీశ్‌ తయారుచేసే వివిధ రకాల బజ్జీలు రుచికరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. బజ్జీ వెరైటీని బట్టీ ధరలు ఉంటాయని, పది నుంచి 75రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నాణ్యతలో రాజీపడకపోవడం వల్ల.. వినియోగదారులు తమ బజ్జీలను ఆదరిస్తున్నారని సతీశ్‌ అంటున్నారు.

ఇదీ చదవండి:

NOTIFICATION : రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.