తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన నేడు దుర్గామాతను బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఈ తొమ్మిది రోజులు రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకరించనున్నారు.
పడవల వీధిలో 1985 నుండి ప్రతి ఏటా దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనా నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. సామూహిక కుంకుమ పూజలను రద్దు చేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిలిపివేశారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఈ ఏడాది అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు నిర్వాహక కమిటీ తెలియజేసింది.
ఇవీ చదవండి: