తూర్పు గోదావరి జిల్లా తాళ్లూరు మండలం లచ్చి పాలెం గ్రామం వద్ద జాతీయ రహదారి ప్రక్కన ఉన్న హనుమంతుని ఆలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఉదయం గ్రామ ప్రజలు చూడగా ఆలయం లోపల హనుమంతుని విగ్రహం నేలపై పడి ఉంది.
వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడ నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపట్టారు. విగ్రహం ధ్వంసం చేయడాన్ని హిందూ ధార్మిక సంస్థ సభ్యులు తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండి: