తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఉడుముడి గ్రామానికి చెందిన కట్టా సత్యనారాయణ ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడు. మృతదేహం బెల్లంపూడి సమీపంలోని ప్రధాన పంట కాలువలో లభ్యమైంది. ఇంటి నుంచి బెల్లంపూడి గ్రామానికి సైకిల్‌పై వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడని ఎస్సై సురేంద్ర తెలిపారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చూడండి