తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లికి చెందిన కొందరు దళితులు... స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత విజేతలను సంబరాలు చేసుకోవద్దని కోరినందుకు.. తమపై వైకాపా నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనపర్తి తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి స్టేషన్ వద్దకు వెళ్లి.. వారితో మాట్లాడారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.
ఇదీ చదవండి: