తూర్పు గోదావరి జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాలుడు మృతి చెందాడు. విశాఖ జిల్లా పాయకరావు పేటకు చెందిన 14 ఏళ్ల సీరం భవానీ శంకర్.. 7వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావటంతో ఖాళీగా ఉన్నాడు.
ఏదైనా పని వెతుక్కోవటానికి సైకిల్‌పై తునికి బయల్దేరాడు. వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ సైకిల్‌ను ఢీకొట్టటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: