తూర్పు గోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్నప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. అధికారులు ఆదివారం పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయడంతో సోమవారం ఉదయాన్నే పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చారు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలుకు అనుమతి ఉండటం వివిధ రకాల కొనుగోళ్లు నిమిత్తం భారీగా జనం మార్కెట్ కు తరలివచ్చారు. రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో వాహనదారులు, వినియోగదారులతో రోడ్డన్నీ రద్దీగా మారాయి. రాష్ట్రంలోనే కరోనా కేసులు నమోదులో మొదటి స్థానంలో కొనసాగుతోంది. కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారులు అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దంటు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ జనం భారీగా రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చూడండి...