తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో... సుమారు 3 వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి చేలు ఇప్పటికీ వాన నీటిలోనే నానుతున్నాయి. గట్టుపై ఉంచిన వరికుప్పల నుంచి మొలకలు బయటికి వస్తున్నాయి. చేలల్లో ఉన్న పంటలు బయటికి తేవాలన్నా... తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఏదో విధంగా ఒబ్బిడి చేసినా ఆ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు. అప్పులు చేసి ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టి ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న కౌలు రైతులకు... ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇస్తామనడం ఎంత వరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎకరాకు అదనంగా రూ.5 వేలు ఖర్చవుతుందని... ప్రభుత్వం తమను ఆదుకుంటేనే రెండో పంట వేయగలమని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. కేరళ రాష్ట్రతరహా విధానాలను అవలంబించాలని కౌలు రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతన్నలు - ముమ్మిడవరంలో నివర్ తుపాన్ ఎఫెక్ట్ తాజా వార్తలు
నివర్ తుపాను ధాటికి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో... సుమారు 3వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికీ పంటలు నీటిలోనే నానుతున్నాయన్నారు. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెడితే.. వర్షానికి అంతా నీటి పాలైందని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకుంటేనే రెండో పంట వేయగలమని... లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.