తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరంలో ఓ పీత చేసిన చేతలకు పర్యటకులు మంత్రముగ్ధులవుతున్నారు. తీరంలో పీత గీసిన కళాఖండాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. తీరంలో జీవించే శాండ్ బాబ్లర్ అనే పీత ఆహార వెతుకులాటలో భాగంగా రకరకాల బొమ్మలు గీస్తోంది. ఇలాంటి చిత్రాలు అనేకం కనిపిస్తూ పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. ఇతర జీవులు వాటి ఆహార సొరంగాలకు వెళ్లకుండా ఈ గీతలు రక్షణగా ఉపయోగపడతాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇదీచూడండి.విషాదం.. కళ్లెదుటే కడుపుకోత