వైద్య కళాశాల ఏర్పాటు పేరుతో పేదల భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చేయడం సరికాదని సీపీఎం నాయకులు, బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్వంలో ధర్నా నిర్వహించారు. అమలాపురం మండలం కామనగరువు పంచాయితీ బడుగువారిపేట వద్ద వైద్య కళాశాల నిర్మాణానికి భూములు సేకరిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా 20 ఎకరాల దళితపేటను కూడా ఖాళీ చేయించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంత్రి విశ్వరూప్‌ను కలిసి ఈ భూములు తీసుకోవద్దని వినతిపత్రం అందించామన్న వారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...