టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేవలం తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చారన్న కారణంగా లబ్ధిదారులకు గృహాలను అందించకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద ఇప్పటికీ కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.
ఇళ్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని.. ప్రజాధనంతో నిర్మించారని రామకృష్ణ తెలిపారు. మరికొన్ని నెలలు గడిస్తే.. అవి నివాసానికి పనికిరాకుండాపోతాయన్న ఆయన.. ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.
CM Review : వ్యాక్సినేషన్‌లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యం