పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక రైతులు నానా ఇబ్బందులూ పడుతుంటే.. ఎరువుల ధరలు 58 శాతం పెంచటం దారుణమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బీమారావు అన్నారు. తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువుల ధరలతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి…: ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడే కిలాడీ దొంగ అరెస్ట్