తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామం కరోనాతో వణికిపోతోంది. రెండు వారాల్లో ఆ గ్రామంలో 14 మంది చనిపోగా... అందులో 8 మంది కొవిడ్ కాటుకు బలయ్యారని అధికారులు వివరించారు.
మిగిలిన ఆరుగురు కూడా ఈ కారణంతోనే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించి ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి సూచించారు. ఇతరులు ప్రవేశించకుండా దారులు మూసివేశారు.
ఇదీ చదవండి:
కబళిస్తున్న మహమ్మారి.. కాకినాడ జీజీహెచ్లో 27మంది కరోనా రోగులు మృతి